ధర్మ పోరాట దీక్షకు దిగిన ఎపి సిఎం చంద్రబాబు

మహాత్ముల చిత్రపటాలకు తొలుత నివాళి
ముఖ్యమంత్రి ¬దాలో తొలిసారిగా దీక్ష
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్ష
పెద్ద ఎత్తున తరలివచ్చిన నేతలు
భారీగా పోలీసుల మొహరింపు…బందోబస్తు
విజయవాడలో ట్రాఫిక్‌ దారిమళ్లింపు
విజయవాడ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): విభజన హావిూల అమలులో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణితో పాటు అన్యాయాలను నిసిస్తూ ఎపి  ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షకు దిగారు. ఓ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి దీక్షకు దిగడం ఇదే ప్రథమం కానుంది.  శుక్రవారం తన జన్మదినం రోజున ‘ధర్మ పోరాట దీక్ష’ పేరిట చంద్రబాబు కనకదుర్గమ్మ సాక్షిగా నిరాహార దీక్ష చేపట్టారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు ఈ దీక్ష  ప్రారంభమైంది. రాత్రి ఏడింటి వరకు కొనసాగనుంది. దీక్షా స్థలికి చేరుకున్న చంద్రబాబు ముందుగా మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌, జ్యోతిరావు పూలే, ఎన్టీఆర్‌ చిత్రపటాలకు పూలమాల వేశారు. అనంతరం ‘మా తెలుగు తల్లికి మల్లెపూ దండ’ ఆలపించారు. దీక్షలో చంద్రబాబుతో పాటు మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, నారా లోకేశ్‌, కొల్లు రవీంద్ర, ఎంపీలు గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్య  సమరయోధులు పావులూరి శివరామకృష్ణ చంద్రబాబుకు నూలుపోగు దండ వేసి అభినందించారు. ఇదే సందర్భంలో తెలుగుదేశం అనుకూల నినాదాలు మిన్నంటాయి. జై చంద్రబాబు, జై ఎన్టీఆర్‌ అంటూ నినదించారు. ముఖ్యమంత్రి వేదికపైకి రాగానే తితిదే, దుర్గగుడికి చెందిన వేదపండితులు, కైస్త్రవ, ముస్లిం మతపెద్దలు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం పలువురు స్వాతంత్య్ర సమర యోధులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. మాజీ సైనికులు ముఖ్యమంత్రిని కలసి సంఘీభావం ప్రకటించారు. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక ¬దా సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హావిూల అమలుకు చేస్తున్న పోరాటంలో భాగంగా చంద్రబాబు ఈ దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించకుండా, దీక్షల ద్వారా అందరూ కేంద్రంపై ధర్మాగ్రహం ప్రకటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో ఒక నాయకుడు ముఖ్యమంత్రి ¬దాలో రాష్ట్రం కోసం పుట్టిన రోజున నిరాహారదీక్ష చేయడం ఇదే ప్రథమం. 68ఏళ్ల  వయసులోనూ ముఖ్యమంత్రి చేస్తున్న దీక్షకు వివిధ పార్టీలు, స్వచ్ఛంద, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. ముఖ్యమంత్రికి సంఘీభావంగా తెదేపా శ్రేణులు, వివిధ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు నిర్వహిస్తున్నాయి. ఏ జిల్లాకు చెందిన మంత్రుల్ని ఆ జిల్లాలోనే దీక్షల్లో పాల్గొనాల్సిందిగా చంద్రబాబు సూచించారు. నవ్యాంధ్రకు ఇచ్చినవి చట్టబద్ధమైన, న్యాయమైన హావిూలను పూర్తిగా నెరవేర్చడం కేంద్రం బాధ్యత అంటూ సీఎం చంద్రబాబు ‘ధర్మ పోరాట దీక్ష’కు సిద్ధమయ్యారు. ఇందిరా గాంధీ స్టేడియంలో ఉదయం సరిగ్గా 7గంటలకు బాబు దీక్ష ప్రారంభించారు. ఇకపోతే చంద్రబాబుకు మద్దతుగా 13 జిల్లాల్లో మంత్రుల దీక్షలు చేపట్టారు. అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ దీక్షను పార్టీ శ్రేణులు ప్రారంభించాయి. కాగా సీఎం ధర్మ పోరాట దీక్షకు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇది ముఖ్యమంత్రి ¬దాలో చేస్తున్న దీక్ష కావడంతో ప్రభుత్వ యంత్రాంగం అవసరమైన
అన్ని ఏర్పాట్లు చేసింది. ధర్మ పోరాట దీక్ష సందర్భంగా శుక్రవారం విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. హనుమాన్‌ జంక్షన్‌ విూదుగా నూజివీడు, మైలవరం,ఇబ్రహీంపట్నంల విూదుగా వాహనాలను మళ్లించారు. దీక్షశిబిరం వద్ద భారీగా పోలీసులు మొహరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఏర్పాట్లు చేశారు.

తాజావార్తలు