నదిలో కూరుకుపోయిన విమానం: ప్రయాణికులు సేఫ్
ఫ్లోరిడా,మే4 (జనంసాక్షి): అమెరికాలోని ఎ/-లోరిడాకు చెందిన జాక్సన్‌విలేలో 140 ప్రయాణికులను తీసుకువెళుతున్న బోయింగ్ 737 నదిలో కూలిపోయింది. విూడియాకు అందిన సమాచారం ప్రకారం విమానం జాక్సన్‌విలేకు చెందిన రన్‌వే నుంచి గాలిలోకి లేచింది. తరువాత అది నేరుగా సెయింట్ జాన్స్ నదిలో కూలిపోయింది. ఈ కమర్షియల్ ప్లయిట్‌లో 133 మంది ప్రయాణికులు, ఏడుగురు క్రూ సిబ్బంది…
మొత్తంగా 140 మంది ఉన్నారు. అయితే విమానం నీటిలో పూర్తిగా మునగక పోవడంతో, దానిలోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. వీరిని బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని జాక్సన్‌విలే మేయర్ తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. సంఘటన జరిగిన వెంటనే ్గ/ర్, రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించామని వారు సహాయక చర్యల్లో నిమగ్నమైవున్నారని తెలిపారు.