నవ్యాంధ్ర అభివృద్దికి బాబు కృషి

 

ఏలూరు,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): పరిపాలనా దక్షతతో నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చి నాలురున్నరేళ్లయిన నేపథ్యంలో సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఇస్తుండటంతో ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు విద్యుత్తు ఇస్తామని గత ఎన్నికల్లో తెదేపా ఇచ్చిన హావిూని అమలు చేస్తున్నారని అన్నారు. విద్యుత్తు ఉత్పత్తి పెరిగితే దాన్ని నిల్వ చేసుకునే అవకాశం లేనందున మిగులు విద్యుత్తును రైతులకు ఇస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.ఇంటింటికీ తెదేపా పేరుతో గ్రామాల్లో ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ఉప ప్రణాళిక నిధుల సద్వినియోగంతో శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు.