నవ్విపోదురు గాక .. ఎఫ్‌డీఐలు,డీజిల్‌ ధర పెంపు

సరైన నిర్ణయాలే
సమర్ధించుకున్న ప్రధాని
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): అంతర్జాతీ యంగా చమురు ధరలు పెరిగిపోయి దేశ ఆర్థిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొం టున్న నేపథ్యంలో కేంద్రం డీజిల్‌ ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయ మని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమర్థించు కున్నారు. శనివారం నాడిక్కడ జరిగిన 12వ పంచవర్ష ప్రణాళిక సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ ఎఫ్‌డీఐలపై తీసుకున్న నిర్ణయా న్నికూడా సమర్థించుకున్నారు. గత రెండు దశా బ్దాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక ఒడిదు డుకులు తలెత్తాయని, ఇటువంటి నేపథ్యంలో మనం 11వ పంచవర్ష ప్రణాళికను ముగించుకుని 12వ ప్రణాళికలోకి అడుగుపెడు తున్నామన్నారు. 11వ పంచవర్ష ప్రణాళికలో ఆర్థిక వృద్ధి రేటు 7.5 శాతం సాధించగలి గామని, ప్రస్తుతం ఆర్థిక స్వావలంబన దిశగా పయనిస్తూ 9 శాతానికి వృద్ధిరేటు పెంచుకునేలా 12వ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే 10వ ప్రణాళికలో వ్యవసాయం 2.4 శాతం ప్రగతిని సాధించిందని, అది 11వ ప్రణాళికకు వచ్చే సరికి 3.3 శాతానికి పెరిగిందని తెలిపారు. వ్యవసాయ రంగ వృద్ధిరేటును మరింత పెంచుకుంటే రైతు ఆర్థికంగా బలపడతాడని తెలిపారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగామని, అయినప్పటికీ వీటితోటే సరిపెట్టుకోకుండా మరింత ముందుకు పోయేం దుకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపుని చ్చారు. మన ఇంధన ధరలు ప్రపంచ వ్యాప్తంగా పోటీకి తట్టుకోవాలంటే కొన్ని సహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకతప్పదని ఆయన అన్నారు. మల్టీ బ్రాండ్‌, రిటైల్‌ఇతర రంగాలలో ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం వల్ల కష్ట సమయంలో ఇవి ఆదుకుంటాయని ఆయన తెలిపారు. సంస్కరణల విషయంలో వెనక్కుతగ్గేదిలేదని తేల్చి చెప్పారు. ఒక వైపు దేశంలో ఆర్థిక రాజకీయ రంగాలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటి నుంచి బయట పడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని తెలిపారు. ఎఫ్‌డీఐకి సంబంధించి తీసుకున్న ఆర్థిక వృద్ధి పెరగుతోందని, ఉద్యోగాల కల్పన శీఘ్రతరం అవుతుందని తెలిపారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాల వల్ల విదేశీ పెట్టుబడులకు భారత్‌ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మన్మోహన్‌ ప్రకటించడం ప్రతిపక్షాలకు చురక అంటించడమే.