హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. నుమాయిష్‌లో ఉన్న ఆంధ్రాబ్యాంక్ స్టాల్‌లో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పారిశ్రామిక ప్రదర్శనలో మూడు స్టాళ్లకు మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో భయంతో జనం పరుగులు తీశారు. మూడు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలార్పుతున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.