నాకు హిందీ బాగా వచ్చు

 

విూ వ్యంగ్యాన్ని అర్థం చేసుకోగలను: నిర్మల

భోపాల్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఓ విలేకరిపై మండిపడ్డారు. 2016లో జరిగిన సర్జికల్‌ స్టయ్రిక్‌పై ఓ విలేకరి వ్యంగ్యంగా ప్రశ్నించడంతో ఆమె విసుగు చెందారు. భోపాల్‌లోని విూడియా సమావేశంలో మాట్లాడుతున్న ఆమెను సర్జికల్స్‌ దాడి జరిగి రెండేళ్లైనా తర్వాత ఇప్పుడు ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రచారం ఎందుకు చేస్తోందని విలేకరి వ్యంగ్యంగా ప్రశ్నించారు. దీనిపై ఆమె స్పందిస్తూ విూరు వ్యగ్యంగా ప్రశ్న అడిగిన తీరు తనను బాధించిందని, విూరు ఉపయోగించిన బిన్‌ బజాయేకు అర్ధం తెలుసునని, తనకు హిందీ అర్థం అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో పాటు ఆ పార్టీ నేతలు.. భారత సైన్యం జరిపిన మెరుపుదాడుల గురించి పదేపదే ప్రస్తావిస్తుండటంపై ఆ విూడియా ప్రతినిధి ఈ విధంగా ప్రశ్నించారు. దీనిపై సీతారామన్‌ సమాధానమిస్తూ ‘ఈ మెరుపు దాడులు ప్రతి భారతీయుడు గర్వించదగ్గవి. శత్రువులపై దాడి సిగ్గుపడే అంశమా?. వాళ్లు ఉగ్రవాదుల సాయంతో మన సైనికులపై దాడికి దిగుతున్నారు. మనం వారి ఉగ్రవాదుల క్యాంపులను లక్ష్యంగా చేసుకున్నాం’ అని అన్నారు. వ్యంగ్యంగా ఈ ప్రశ్న అడిగిన తీరు నన్ను బాధించిందని పేర్కొన్నారు. ‘ఒకవేళ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇలాంటి మెరుపుదాడులు నిర్వహిస్తే.. ఆ పార్టీ ప్రచారం చేసుకోవచ్చు. ఎందుకంటే దేశం గర్వించదగ్గ విషయాలు ఇవి’ అని సీతారామన్‌ పేర్కొన్నారు.