నారాయణఖేడ్ నియోజకవర్గం నగల్ గిద్ద మండల కేంద్రంలో ఘనంగా రైతు రచ్చబండ
నారాయణఖేడ్ జులై24(జనంసాక్షి)
రైతులను మోసం చేసి రైతులకు సంకెళ్లు వేసి జైలు పాలు చేసిన తెరాస ప్రభుత్వాన్ని గధ్యా దించడమే లక్ష్యంగా
ఆదివారంనాడు నగల్గిద్ద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమం లో భాగంగా నారాయణఖేడ్ నుండి పెద్ద ఎత్తున వాహనాలతో ర్యాలీగా వెళ్లి నగలిద్ద మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యక్తలు మహిళలు హారతులు, డప్పు సపుడుతో టపసులతో స్వాగతం పలికారు
రచ్చబండ కార్యక్రమం . మండల అధ్యక్షులు మాణిక్ రావు పటేల్ అధ్యక్షతన పిసిసి ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ సురేష్ శెట్కర్, పిసిసి సభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి , మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్న వివక్షత గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని భూమి ఉన్న రైతులకు మరియు కౌలు రైతులకు సంవత్సరానికి 15 వేల రైతుబంధు ఇచ్చి ఉపాధి కల్పిస్తామని ఉపాధి హామీ కూలీలకు కూడా 12000 ఇచ్చి ఆదుకుంటామని ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా మోసం చేస్తుందని వరివేస్తే ఉరి అన్న కేసీఆర్ కి గట్టి గుణపాఠం చెప్పాలని అన్నారు గ్రామాలలో పింఛన్ రేషన్ కార్డు లేక ప్రజలంతా ఇబ్బందుల్లో ఉన్నారని వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణ పాఠం చెప్పాలని 12 నెలల్లో ఎన్నికలు వస్తాయని వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రైతు ఆనందమే ముఖ్యమని ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలియజేశారు
ఈ కార్యక్రమంలో నగేష్ శేట్కర్ గారు మరియు డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి గారు,నారాయణఖేడ్ పట్టణ ఫ్లోర్ లీడర్ ఆనంద్ స్వరూప్ శేట్కర్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ శెట్కర్ గారు మరియు నారాయణఖేడ్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కే శ్రీనివాస్ గారు యువజన కాంగ్రెస్ నాయకులు సాగర్ శెట్కర్ గారు యూత్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివరాథోడ్ గారు,డీసీసీ ఉపాధ్యక్షులు శంకరయ్య స్వామి,pacs చైర్మన్ లు మరియు అన్ని మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీ లు,మాజీ ఎంపీటీసీ మాజీ జెడ్పిటిసిలు యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు