నాలుగేళ్లలో ఐటీఎగుమతులు లక్ష కోట్లు దాటాయి

– బెంగళూరును దాటడమే తమ లక్ష్యం

– ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాం

– 17:17 ఆర్థిక వృద్ధి రేటుతో శరవేగంగా పురోగమిస్తున్నాం

– తెరాసతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది

– మంచివారిని ఎన్నుకొనే అవకాశం మన చేతుల్లోనే ఉంది

– అప్రమత్తంగా ఉండి ప్రజాపాలకులకు ఓటేయండి

– ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబర్‌22(జ‌నంసాక్షి) : నాలుగేళ్లలో ఐటీ ఎగుమతులు లక్షకోట్లు దాటాయని, ఐటీ

ఎగుమతుల్లో బెంగళూరును దాటడమే తమ లక్ష్యమని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నమని కేటీఆర్‌ చెప్పారు. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని, మంచివారిని ఎన్నుకునే అవకాశం మనచేతుల్లోనే ఉందని అన్నారు. గురువారం మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో విద్యార్థులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉపయోగించుకోవాలన్నారు. ఏ అభ్యర్థి నచ్చకపోతే నోటాకైనా ఓటేయాలని కేటీఆర్‌ సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు హైదరాబాద్‌లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ఎన్నో దుష్పచ్రారాలు చేశారని కేటీఆర్‌ విమర్శించారు. సీమాంధ్రులను హైదరాబాద్‌ నుంచి పంపించేస్తారంటూ అపోహలు సృష్టించారన్నారు. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసుందామని తాము ఆనాడే చెప్పామని కేటీఆర్‌ స్పష్టంచేశారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఏవర్గంపైనా వివక్ష చూపలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఐటీరంగం ఊపందుకుందని, గూగుల్‌, ఆపిల్‌, ఫేస్‌బుక్‌, అమేజాన్‌ వంటి సంస్థలు వచ్చాయని కేటీఆర్‌ అన్నారు. ఐటీ ఎగుమతులు రూ.లక్ష కోట్లకు చేరాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును అధిగమించి.. హైదరాబాద్‌ను నెంబర్‌వన్‌గా మార్చడమే తమ లక్ష్యమని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 35శాతం వ్యాక్సిన్‌లు హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్నాయని కేటీఆర్‌ చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ టీహబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు 15రోజుల్లోనే అనుమతి ఇస్తున్నామన్నారు. అనుమతుల విషయంలో ఆలస్యం చేసిన అధికారులకు రోజుకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తున్నం. 17:17 ఆర్థిక వృద్ధి రేటుతో శరవేగంగా పురోగమిస్తున్నారు. యువతకు నైపుణ్య శిక్షణ కోసం టాస్క్‌ తీసుకున్నామని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌వన్‌గా ఉన్నామని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ అభ్యర్థి మల్లారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హైదరాబాద్‌ పౌరుల్లో గుణాత్మక మార్పు వచ్చిందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. రాజకీయ సుస్థిరత ఉంది కాబట్టే ఆర్థికంగా ఆశించిన వృద్ధి రేటు వస్తోంది. ప్రపంచలోనే 35 శాతం వ్యాక్సిన్లు హైదరాబాద్‌ ఉత్పత్తి అవుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ టీహబ్‌ హైదరాబాద్‌ ఏర్పాటు చేసుకున్నామని, యువతకు నైపుణ్య శిక్షణ కోసం టాస్క్‌ ఏర్పాటు చేసుకున్నామని, కాంగ్రెస్‌, టీడీపీ కాలంలో హైదరాబాద్‌ కర్ఫ్యూ ఉండేదని, నాలుగున్నరేళ్ల టీఆర్‌ పాలనలో ఒక్కసారి కూడా కర్ప్యూ విధించలేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.