నాలుగో టెస్ట్ కు రహానే దూరం
ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా రేపటి నుంచి ముంబైలో జరగనున్న నాలుగో టెస్ట్ కు రహానేను తప్పించారు. గాయంతో రహానే ఈ టెస్ట్ కు దూరం అయినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే పేస్ బౌలర్ షమీ ఈ టెస్టులో ఆడేదీ లేనిదీ రేపు ఆట ప్రారంభానికి ముందు ప్రకటించనున్నట్లు పేర్కొన్నాయి. ఇలా ఉండగా నాలుగో టెస్ట్ కు మనీష్ పాండేకు స్థానం లభించింది. రహానే స్థానంలో మనీష్ పాండేను ఎంపిక చేశారు.