నిండిపోయిన రైళ్లు
` అసహనంతో ట్రెన్‌పై దాడి చేసిన ప్రయాణికులు
` నో వెహికిలో జోన్‌గా కుంభమేళా
` మాఠపౌర్ణమితో కుంభమేళాకు పెరగనున్న రద్దీ నేపథ్యంలో ఆంక్షలు
` రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తుల రాకపై సీఎం సవిూక్ష
ప్రయాగరాజ్(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అక్కడ జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. భక్తులతో ఆయా మార్గాల్లో నడుస్తున్న రైళ్లన్నీ రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మధుబని రైల్వే స్టేషన్‌లో రైలుపై ప్రయాణికులు దాడి చేశారు. స్వతంత్ర సేనానీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్‌లోని జైనగర్ నుంచి ప్రయాగ్‌రాజ్ విూదుగా న్యూ ఢల్లీికి వెళ్తోంది. ఈ క్రమంలో మధుబని రైల్వే స్టేషన్‌లో కుంభమేళా భక్తులు రైలు ఎక్కేందుకు ప్లాట్‌ఫామ్‌పై భారీ సంఖ్యలో చేరుకున్నారు. అయితే, అప్పటికే రైలు పూర్తిగా నిండిపోయింది. కాలుతీసి కాలుపెట్టేకి లేకుండా యాత్రికులతో కిక్కిరిపోయింది. రద్దీ కారణంగా మధుబని రైల్వే స్టేషన్‌లో రైలు డోర్లను అధికారులు తెరవలేదు. దీంతో ఆగ్రహించిన యాత్రికులు రైలుపై రాళ్లతో దాడి చేశారు ఏసీ కోచ్ కిటికీ అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రయాణికుల చర్యతో రైల్వే స్టేషన్‌లో భయాందోళన వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.మాఘ పూర్ణిమతో పాటు కొన్ని రోజుల్లో కుంభమేళా పూర్తికానున్న నేపత్యంలో ప్రయాగ్‌రాజ్‌కు భారీగా భక్తులు తరలిరానున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. సంగం ఘాట్ వద్ద చోటుచేసుకున్న ఆ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దానిని దృష్టిలో ఉంచుకొని మాఘ పూర్ణిమ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఒకరోజు ముందు నుంచే మంగళవారమే ఆంక్షలు విధించారు. ఇప్పటికే గత వారాంతం ఎఫెక్ట్‌తో 350 కి.విూ. దూరం వరకు వాహనాలు నిలిచిన సంగతి తెలిసిందే. వీటన్నింటిని దృష్టిలోపెట్టుకొని అధికారులు కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా మార్పు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్‌రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్‌గా మారుస్తామని వెల్లడిరచారు. శని, ఆదివారాల్లో లక్షల మంది కుంభమేళా యాత్రికులు ఏకంగా 24 గంటలకు పైగా రహదారి పైనే వాహనంలో ఉండిపోవాల్సి వచ్చింది. జబల్‌పుర్-ప్రయాగ్‌రాజ్ మార్గంలోని జాతీయరహదారిపై సుమారు 350 కి.విూ. పొడవున వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘటన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్‌గా చరిత్ర పుటలకు ఎక్కింది. మరో 48 గంటల పాటు ఎవరూ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్ పరిస్థితులను గూగుల్‌లో చూసుకుంటూ ముందుకుసాగాలన్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్, సివనీ, కట్నీ, మైహర్, సాత్నా, రివా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. 50 కి.విూ. మేర దూరం వెళ్లడానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక, ట్రాఫిక్ ఏర్పాట్ల గురించి సోమవారం రాత్రి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పోలీసులు, అధికారులు సమావేశమయ్యారు. ‘రోడ్లపై వాహనాలు భారీగా చేరకుండా చూడాలి. రద్దీ లేకుండా చూసుకోవాలి. పార్కింగ్ ప్రాంతాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి‘ అని సీఎం ఆదేశాలు ఇచ్చారు.
మాఠపౌర్ణమితో కుంభమేళాకు పెరగనున్న రద్దీ
మాఘ పూర్ణిమ.. కారణంగా కుంభమేళాకు మరింతగా భక్తులు పోటెత్తనున్నారు. ఇప్పటకే రోజుకు కోటిన్నర వరకు పుణ్యస్నానాలకు వస్తున్నారని అంచనా. ఈ నెల 12న మాఘపూర్ణిమ కారణంగా మరింత రద్దీ పెరగనుంది. ఇప్పటికే వందల కిలోవిూటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడిరది. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున భగవంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆర్థిక బాధలు తొలగి అష్టశ్వైర్యాల సిద్ధి కలుగుతుందని చెప్తారు. పౌర్ణమి నాడు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం అర్పించడంఅ వసరమని అంటున్నారు. దీంతో త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తనున్నారు. స్నానానంతరం పూజా కైంకర్యాలను నిర్వహించుకోవడం ఆనవాయితీ. వీలైతే ఏదైనా దేవాలయాన్ని సందర్శించడం వల్ల శుభం కలుగుతుంది. ఈ రోజున చేసే గంగా స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ, ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు. కాబట్టి వీలైనవారు నదీ స్నానం చేసుకుని శివకేశవులను ఆరాధించుకోవచ్చు. మాఘ పౌర్ణమి రోజున మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లో జీవహింస చేయరాదు. ఇనుప వస్తువులు, నల్లని బట్టలు, వెండి, పాలు, ఉప్పు, సూదులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులు బయటకు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల శని, చంద్ర దోషాలు వస్తాయని చెప్తారు. వీలైతే వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లిని తీసుకోకుండా ఉండాలి. విూ భోజనం విూరే వండుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఇతరులను మోసగించడం, దూషించడం, శారీరకంగా, మాటలతో గానీ హింసించడం వంటివి చేయకూడదు. ఇతరులను అకారణంగా నిందించకూడదు. నల్ల దుస్తులు ధరించకూడదు. రాత్రి ఎక్కువ సమయం వరకు మేలుకుని ఉండకూడదు. ఈ రోజు కచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించడానికి ప్రయత్నించడం మంచిదని అంటున్నారు. ఇది ఎంతో శ్రేష్ఠమైనదిగా నమ్ముతారు. అవసరంలో ఉన్నవారికి, పేదవారికి అన్న, వస్త్ర దానాలు చేయడం చాలా మంచింది. విష్ణు మూర్తిని పూజించడం, పౌర్ణమి వెన్నెల్లో విష్ణు సహస్రనామం జపించడం ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజు చేసే ఉపవాసం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి.రోజున ఆహారం దానం చేసిన వారికి జీవితంలో ధనానికి, తిండికి లోటు ఉండదని నమ్ముతారు. లక్ష్మీదేవి వారింటిని ఐశ్వర్యంతో నింపుతుందని నమముతారు. పౌర్ణమి రోజున సౌందర్య సాధనాలను దానం చేయడం వల్ల భర్త పిల్లల ఆయుష్షు పెరుగుతుందని ఉత్తరాది ప్రజలు నమ్ముతారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ప్రసన్నం కలుగుతుందని నమ్ముతారు. మాఠపౌర్ణమి సందర్భంగా కూడా కుంభస్నానానికి వస్తారు. మౌని అమావాస్యతో పాటు ఈరోజుకు కూడా విశేష ప్రాధాన్యం ఉంది.