నిజాంపేట మండలంలో ర్యాలమడుగు గ్రామము కల్పవద్దు,

 

హైదరాబాద్  రోడ్డుపై ధర్నా నిర్వహించిన గ్రామస్తులు

నారాయణఖేడ్ జులై24(జనంసాక్షి)

ర్యాలమడుగు, మాణిక్ నాయక్ తాండ  గ్రామస్తులు  నిజాంపేట్ మండలంలో కల్పవద్దని హైదరాబాద్ రహదారిపై పెద్దపెద్ద మొద్దులను పెట్టి, రెండు గంటల పాటు  ధర్నా నిర్వహించారు. ఆదివారం వారు గ్రామస్తులు మాట్లాడుతూ  పూర్వం నుండి  ర్యాలమడుగు గ్రామం నారాయణఖేడ్ మండలంలో ఉన్నదని, మాకు అన్ని సౌకర్యాలుగా ఉందన్నారు.కొత్తగా ఏర్పడిన నిజాంపేట మండలం మా గ్రామం కల్పవద్దని అందుకే ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. గతంలో ఎమ్మెల్యేకు తెలిపామన్నారు.  నారాయణఖేడ్ 5 నిజాంపేట 8 కిలోమీటర్  ఉంటుందన్నారు.   గ్రామము నారాయణఖేడ్ మండలంలోనే ఉండాలని గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా  తీర్మానం చేశామన్నారు. మూడు కిలోమీటర్ల వేరకు  వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి  ఎస్ఐ వెంకటరెడ్డి , సీఐ వెంకటేశ్వర్లు వారికి నచ్చజెప్పి ధర్నాను విరమించారు. ధర్నాలు  లో సర్పంచ్ పద్మ మాణిక్ రెడ్డి, ఉప సర్పంచ్ అల్లాదుర్గం సాయిలు, ఎంపిటిసి   మోతిబాయి, గ్రామస్తులు  బైరి మల్లయ్య, సుధామ్, పరమేశ్వర్, పెద్ద సాయిలు, శ్రీనివాస్, రామ్ రెడ్డి, వీర రెడ్డి,రమేష్, సాయిలు మాణిక్ నాయక్ తoడాకు చెందినవారు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.