నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రికి వినతి.

మల్కాజిగిరి.జనంసాక్షి.అక్టోబర్ 7
వర్షాకాలంలో మల్కాజిగిరి నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు, వీకర్ సెక్షన్లు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతి పత్రాన్ని అందజేసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లా నని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.నియోజకవర్గంలోని తొమ్మిది డివిజన్లలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వాటిని దశలవారీగా పరిష్కరిస్తున్నమని తెలిపారు.కొత్తగా ఏర్పడిన కాలనీలకు డ్రైనేజీ,మంచినీరు,విద్యుత్ అలాగే అప్పటి జనాభాకు అనుగుణంగా 20 సంవత్సరాల క్రితం వేసిన డ్రైనేజీలు సరిపోక పైపులు ధ్వంసమై మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుందని,వర్షాకాలంలో చెరువులు పొంగి మురుగు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారని,ఇప్పటికే లోతట్టు ప్రాంతాలలో బాక్స్ డ్రైనేజిలు ఏర్పాటు చేశామని తెలిపారు.కొత్తవి అలాగే పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులకు అధికారుల ప్రణాళికల ప్రకారము 382.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు.
Attachments area