నిమజ్జన కార్యక్రమాలను సందర్శించిన నియోజకవర్గ గణేష్ ఉత్సవ కమిటీ
మునగాల, సెప్టెంబర్ 10(జనంసాక్షి): మండలంలోని సాగర్ ఎడమ కాలువలో జరుగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాలను కోదాడ నియోజకవర్గ గణేష్ కమిటీ సభ్యులు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోదాడ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో అంగరంగ వైభవంగా మూషిక వాహనునికి నవరాత్రులు ఉదయం , సాయంత్రం పూజలు జరిగాయని, గణేశుని నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభోఫెతంగా కన్నుల పండుగగా నిర్వహించారని తెలిపారు. గణేశుని ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు కలగాలని భగవంతుని కోరారు. అనంతరం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో మునగాల తహసిల్దార్ కృష్ణ నాయక్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎస్ఐ బాలు నాయక్, సర్పంచ్ చింతకాయల ఉపేందర్ లను ఘనంగా సన్మానించారు. గణేష్ నిమజ్జనం కార్యక్రమాలకు సహకరించిన పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఆరోగ్యశాఖ, ఎన్ఎస్పి అధికారులకు, ఉత్సవ కమిటీ సభ్యులు మరియు భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ నియోజకవర్గ అధ్యక్షులు కనగాల నారాయణ, ప్రధాన కార్యదర్శి వేమూరి సత్యనారాయణ, కన్వీనర్ ఓరుగంటి కిట్టు, ఉపాధ్యక్షులు వంగాల పిచ్చయ్య, దాట్ల సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.