నిరంతర కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
జనగామ,ఆగస్టు 8(జనం సాక్షి): రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మాజీ ఉపముఖ్యమంత్రి,ఘనాపూర్ ఎమ్మెల్యే రాజయ్య పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలు తీసుకొచ్చారని అన్నారు. దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందని తెలిపారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాం. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే పీడీయాక్టు లాంటి చట్టాలు తీసుకొచ్చామని వివరించారు. రూ.17వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. మిషన్ భగీరథతో దీపావళి నాటికి ఇంటింటికి మంచినీరు అందిస్తామని చెప్పారు.