నిరాధారమైన వ్యాఖ్యలు సరికాదు…
సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్
ఆధారాలు చూపిస్తే చట్టపరమైన చర్యలకు సిద్ధం.. తస్లీమా
ములుగు,జూలై (జనం సాక్షి):-
నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు.ఎలాంటి ఆధారాలు లేకుండా యు న్యూస్ యుట్యూబ్ ఛానల్ రిపోర్టర్ చిలుక ప్రవీణ్, మొగుళ్ళ భద్రయ్యతో కలిసి నాపై, ఎమ్మెల్యే సీతక్క పై అసభ్యకరమైన పదాలతో తప్పుడు ప్రసారాలు చేయడాన్ని తస్లీమా ఖండించారు.బుధవారం తస్లీమా ఒక ప్రకటనలో మాట్లాడుతూ నాపై కుట్రపూరితంగా చేసిన అసత్యపు ఆరోపణలు సరైనవి కావని,ఒక వేళ ఆధారాలతో నిరూపిస్తే చట్టపరమైన చర్యలకు తాను సిద్ధమని తస్లీమా తెలిపారు.సామాజిక కార్యకర్తగా చెప్పుకొనే మొగుళ్ళ భద్రయ్య అనే వ్యక్తి,చిలుక ప్రవీణ్ కు తప్పుడు సమాచారం ఇచ్చి నాపై ఎమ్మెల్యే సీతక్కపై తప్పుడు ప్రచారం చేశారు,తప్పుడు ప్రచారం చేసిన చిలుక ప్రవీణ్,మొగుళ్ళ భద్రయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి పిటిషన్ చేసినట్లు తస్లీమా తెలిపారు.అసత్యపు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టదావా వేయనున్నట్లు తస్లీమా తెలిపారు.