నిరుద్యోగ భృతి అందరికీ అందేలా చూడాలి

 

అనంతపురం,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హావిూ మేరకు ఉద్యోగం కల్పించడం లేదా నిరుద్యోగ భృతి ఇవ్వడం అన్న హావిూని అందరికీ వర్తించేలా అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీశ్వర్‌ అన్నారు. వేయిరూపాయ భృతి ఏ మూలకు సరిపోదని, ఉద్యోగ దరఖాస్తులకు, ఫీజులు లేకుండ చూడాలన్నారు.నిరుద్యోగులకు గత మూడున్నరేళ్లుగా ఉద్యోగాలు రాలేదని, వారంతా నిరాశలో ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నిరుద్యోగులందరికీ రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగభృతిని కల్పించి ఆదుకోవాలని ఆయన అన్నారు. ఈ నిరుద్యోగ భృతి ముఖ్యంగా ఉద్యోగలు రాని వారికే చెందాలన్నారు. ఐటి శాఖ మంత్రి లోకేశ్‌ దీనికోసం కసరత్తు చేయాలన్నారు.చాలామంది గ్రావిూణ విద్యార్థులు, అవగాహన లేని విద్యార్థులు ఉపాధి కార్యాలయాలలో తమ వివరాలు నమోదు చేసుకోలేదన్నారు. నిరుద్యోగుల వివరాలను సేకరించడంలో భాగంగా దారిద్యర్రేఖకు దిగువన ఉన్న విద్యార్థుల వివరాల సేకరణకుగాను తెల్ల రేషన్‌ కార్డును ప్రాతిపదికగా తీసుకున్నట్లయితే నిజమైన నిరుద్యోగులు ఎక్కువశాతం బయటపడతారు. అదే విధంగా నిరుద్యోగుల్లో కొందరికి తెల్ల రేషన్‌ కార్డు లేదు. వీరినీ దృష్టిలో ఉంచుకుని ఇటువంటి వారి వివరాల కొరకు కుటుంబ సంవత్సర ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని, తద్వారా నిజమైన నిరుద్యోగులను ఎంపిక చేసి, వారికే నిరుద్యోగభృతి అందచేయాలన్నారు.