నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి:బీజేవైఎం మండల అధ్యక్షులు ముత్యాల చంటి.

దౌల్తాబాద్ నవంబర్ 29, జనం సాక్షి.
బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బీజేవైఎం మండల అధ్యక్షులు ముత్యాల చంటి ఆధ్వర్యంలో దౌల్తాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు ముత్యాల చంటి ఆధ్వర్యంలో సీనియర్ అసిస్టెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బీజేవైఎం దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు ముత్యాల చంటి మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడుస్తున్నా గాని తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చంటి అన్నారు ఎన్నికల హామీలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తానని దాదాపు 48 నెలలు గడుస్తున్నా గాని ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అమలు కావడం లేదని వారు అన్నారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని శాఖలకు నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇప్పటివరకు ప్రతి నిరుద్యోగికి 48 నెలల నిరుద్యోగ భృతి ఒక్కో నిరుద్యోగి 1,44 768 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని
ఇప్పటివరకు జారీ చేసిన నోటిఫికేషన్లకు వెంటనే నియామకాలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం దౌల్తాబాద్ మండల వైస్ ప్రెసిడెంట్ జంగాపల్లి నవీన్ గౌడ్, జనరల్ సెక్రెటరీ నరేష్ యాదవ్,మండల కార్యదర్శి అంజి, ప్రశాంత్, సీనియర్ నాయకులు బండి రాజు తదితరులు పాల్గొన్నారు