నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ బ్యూరో, ఆగస్టు26 ,జనంసాక్షి: నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ సముదాయాన్ని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. కలెక్టర్ ముశ్రఫ్ అలీ ఫారూఖీ, ఇతర అధికారులు, గుత్తేదారులతో కలిసి నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్ లో మంత్రి కలియతిరిగారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ ల ఛాంబర్ లు, మీటింగ్ హాల్ లు, ప్రభుత్వ శాఖల కార్యాలయాలను పరిశీలించారు. అనంతరం భవనం ఆవరణలో జరుగుతున్న సుందరీకరణ, గార్డెనింగ్, అప్రోచ్ రోడ్డు, తదితర పనులపై ఆరా తీశారు. నిర్మాణ ప్రగతిపై అక్కడే సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. భవన నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.