నిస్వార్థపరుడు దళితరత్న బొమ్మల కట్టయ్య

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

– కరీమాబాదులో బుద్ధుడు, అంబేద్కర్, బొమ్మల కటయ్య విగ్రహాల ఆవిష్కరణ
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 28(జనం సాక్షి)
 దళిత రత్న బొమ్మల కట్టయ్య స్వార్థం లేని నిస్వార్థ వ్యక్తి అని ఎప్పుడు తన వ్యక్తిగతంగా ఏమి ఆశించలేదని ఎప్పుడు అంబేద్కర్ ఆశయాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలని నిరంతరం పాటుపడే వ్యక్తి అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్ అంబేద్కర్ భవన్ ముందు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యలు భగవాన్ గౌతమ బుద్ధ, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు దళిత రత్న బొమ్మల కట్టయ్య విగ్రహాలను ఆవిష్కరించారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేట్ రంగాన్ని ప్రోత్సహించి అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని రిజర్వేషన్లు రూపుమాపే ప్రయత్నం చేస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకులు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే పదవులు అనుభవిస్తున్నారని ప్రతి ఒక్క రాజకీయ నాయకులు గుర్తు చేసుకోవాలని మంత్రి అన్నారు. దళిత రత్న బొమ్మల కటయ్య తనకి ఎంతో ఆప్తుడు అని ఏ సమస్య అయినా ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకునే వాడినని ఇప్పుడు ఆయన ఆశయ సాధన కోసం తన వంతు కృషి చేస్తానని ఉమ్మడి జిల్లాలో బౌద్ధ భవన్ ను ఏర్పాటు చేసేందుకు వరంగల్ హనంకొండ జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతానని అన్నారు. అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కోరిన విధంగా కృషి చేస్తానని త్వరలోనే నగరంలో ఏదైనా ముఖ్యమైన చోట బొమ్మల కట్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అక్కడ బొమ్మల కట్టయ్య మార్క్ అని కూడా నామకరణ చేస్తామని ఆయన కుటుంబానికి ఎప్పుడు తాను అండగా ఉంటానని బొమ్మల కట్టయ్య ఆశయాలు ముందుకు తీసుకువెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి దయాకర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం బాధ్యులు బొమ్మల అంబేద్కర్, నీలం మల్లేశం, వై మహేందర్, తరాల రాజమణి ,కళావతి, రవితేజ, కడారి కుమార్ తదితరులు పాల్గొన్నారు.