నీలి నాలిక నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సిన్
కొండపాక (జనం సాక్షి )జులై 22: గొర్రెలలో నీలి వ్యాధి నివారణకు ముందు జాగ్రత్తగా టీకాలు వేస్తున్నట్లు ఈ విషయాన్ని గొర్రెల పెంపకదారులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు దుద్దెడ సర్పంచ్ ఆరెపల్లి మహాదేవ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో వెటర్నరీ డాక్టర్ నిఖిల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గొర్రెలకు నీలి వ్యాధి నివారణకు టీకాలు మందులు పంపిణీ కొండపాక మండల తెరాస అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇప్పుడు కూడా గొర్రెల మరియు మేకలకు నీలి నాలుకకు వ్యాక్సినేషన్ లేదని గ్లిజరిన్ లాంటి పాత మెడిసిన్ మాత్రమే వాడే వారని కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గొర్రెలు మేకలకు నీలి నాలిక రాకుండా చూశారు. మరియు ఒకవేళ సోకినట్లయితే ఆ రోగ నిర్ధారణ కోసం వ్యాక్సిన్ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావడం శుభ పరిణామం అని అన్నారు. పశువుల కోసం అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయడం పట్ల కూడా కాపర్లు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుండెల్లి ఆంజనేయులు వార్డు సభ్యులు కాట రమేష్ పశు వైద్య సిబ్బంది కిషన్, రమేష్, గొర్రెల కాపరులు దోమల నర్సింలు, జక్కుల శ్రీశైలం, జక్కుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.