నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం
సంగారెడ్డి టౌన్ జనం సాక్షి
ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ ఇన్నోవేషన్ కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారి తో పాటు అదనపు జిల్లా కలెక్టర్లు , జిల్లా విద్యాశాఖ అధికారి , జిల్లా ఎందలి వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు మరియు ఐఐటి హైదరాబాద్ , జెఎన్టియు సుల్తాన్పూర్ , గీతం యూనివర్సిటీ కి సంబంధించిన, వారు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని జిల్లా సైన్స్ అధికారి నిర్వహించారు.
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ జిల్లాలలో ఆవిష్కరణల ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా ప్రతి ఇంట ఉన్న ఆవిష్కర్తలు వారి సమస్యలకు పరిష్కారం సొంతంగా కనుగొనేలా ప్రోత్సహిస్తుందన్నారు. ఎంపికైన ఆవిష్కర్తలకు స్వాతంత్ర దినోత్సవం నాడు ఆయా జిల్లాల్లో వారి ఆవిష్కరణలు ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందులో సాధారణ గృహిణి మొదలు అన్ని రంగాల వారు పాల్గొనవచ్చన్నారు. గ్రామీణ ఆవిష్కరణ ,విద్యార్థుల ఆవిష్కరణ, ప్రారంభ ఆవిష్కరణలు, సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలలో ఆవిష్కరణలు మొదలైనవి ఉండవచ్చాన్నారు. ఆవిష్కర్త తమ ఆవిష్కరణ ఏ సమస్యను పరిష్కరిస్తుందో స్పష్టంగా చెప్పాలన్నారు. సమస్యకు పరిష్కారం సృజనాత్మకంగా ప్రామాణికంగా ఉండాలన్నారు.
ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాల వివరణ, నాలుగు చిత్రాలు, రెండు నిమిషాల వీడియోను, ఆవిష్కరణ పేరు ,వయస్సు, ప్రస్తుత వృత్తి, గ్రామం పేరు, జిల్లా పేరును 9100678543 నంబరుకు వాట్సాప్ ద్వారా ఆగస్ట్ 5వ తేదీ లోపు పంపాలన్నారు.
మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ అధికారి ఫోన్ నెంబర్ +91 99634 23691 లో సంప్రదించవచ్చని సూచించారు.
ఆసక్తి గల జిల్లా లోని ఆవిష్కర్తలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.




