నెన్నెల మండలంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఫోటో రైటప్: జాతీయజెండా ఆవిష్కరిస్తున్న నెన్నెల ఎంపీపీ సంతోషం రమాదేవి.
బెల్లంపల్లి, ఆగస్టు15, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలంలో సోమవారం ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయజెండా ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. మిఠాయిలు పంచి పెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ భూమేశ్వర్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సంతోషం రమాదేవి, పొలీస్ స్టేషన్లో ఎస్సై రాజశేఖర్, అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో రేంజర్ గోవింద్ చంద్, సర్దార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఝాన్సీ, మండల వనరుల కార్యాలయంలో ఎంఇఓ మహేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నారాయణ, అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో సంబంధిత అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు.