నెల్లూరు పోలీస్‌ హాస్పిటల్‌లో మెగా వైద్య శిబిరం

నెల్లూరు,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. శుక్రవారం నెల్లూరు పోలీస్‌ హాస్పటల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నెల్లూరు నగర సబ్‌ డివిజన్‌, డిపిఎంపి అసోయేషన్‌ ఆఫ్‌ ఇండియా వారు సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌వన్‌ ప్రారంభించారు. అనంతరం అడిషనల్‌ ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల అమరవీరులను, వారి త్యాగాలను స్మరిస్తూ.. ప్రసంగించారు. పోలీసులతో పాటు శిబిరానికి విచ్చేసిన పోలీసుల కుటుంబాలు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషినల్‌ ఎస్పీ కైమ్ర్‌ ఆంజనేయులు, అడిషినల్‌ ఎస్పీ ఎఆర్‌ వీరభద్రుడు, టౌన్‌ డీఎస్పీ మురళీకృష్ణ, ఎఆర్‌ డిఎస్పీ చంద్రశేఖర్‌, పోలీస్‌ సంఘం అధ్యక్షులు ప్రసాదరావు, స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు నాయుడు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

తాజావార్తలు