నేటినుంచి కాంగ్రెస్‌ భరోసా యాత్ర

13రోజులు..13 జిల్లాల్లో పర్యటనలు
మడకశిరలో మొదలు….ఇచ్చాపురంలో ముగింపు
అమరావతి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ప్రత్యేక¬దా కాంగ్రెస్‌ మాత్రమే ఇస్తుందన్న నమ్మకం కలిగించడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో మళ్లీ పుంజుకునేందుకు కాంగ్రె/- సన్నద్దం అయ్యింది. ఇందులో భాగంగా  ప్రత్యేక¬దా భరోసా ప్రజాయాత్ర పేరుతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న బస్సుయాత్ర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 13 రోజులపాటు 13 జిల్లాల్లో నిర్వహించనున్న ఈ యాత్ర అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి మొదలు కానుంది. మార్చి 3న ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. మొత్తం 2251 కిలోవిూటర్ల పొడవున ఈ యాత్ర జరగనుంది. ఈ సందర్భంగా మొత్తం 54 సభలు నిర్వహించాలని ఏపీ పీసీసీ నిర్ణయించింది. కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీతోపాటు వివిధ రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు రోజుకొకరు చొప్పున యాత్రలో పాల్గొంటారు. రాహుల్‌ పర్యటన ఇంకా ఖరారు కాలేదు. ఈ నెల 26న లేదా 27న వచ్చే అవకాశముందని ఏపీ పీసీసీ వర్గాలు తెలిపాయి. ప్రియాంక పర్యటనపై స్పష్టత రావాల్సి ఉంది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ యాత్రలో పాల్గొంటారు. ఇదిలావుంటే ఇప్పటికే ప్రత్యేక¬దా కోసం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ స్పష్టమైన హావిూ ఇచ్చారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తొలి వాగ్దానంగా దీనిని నెరవేరుస్తారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. న్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైకాపా, తెదేపాలకు బీసీలపై ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొస్తోందని  విమర్శించారు. వెనుకబడిన వర్గాలపై అంత ప్రేమ ఉంటే వారిని ముఖ్యమంత్రిని చేయగలరా అని ప్రశ్నించారు.