నేటినుంచి మండలి సమావేశాలు
మండలి ఛైర్మన్‌తో పోలీస్ అధికారుల భేటీ
హైదరాబాద్,సెప్టెంబర్26(జనంసాక్షి): శాసన మండలి సమావేశాలు గురువారం నుంచి జరుగనున్నాయి. కేవలం ఒక్కరోజు జరుగుతాయా లేక రెండుమూడు రోజులా అన్నది బిఎసి సమావేశంలో తేలనుంది. ఈ మేరకు చైర్మన్ స్వామిగౌడ్‌తో పోలీసు ఉన్నతాధికారులు బుధవారం సమావేశమయ్యారు. శాసనమండలి సమావేశాల సందర్భంగా భద్రతపై చర్చ జరిగింది. అయితే ఒక్కరోజే సభ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరణించిన మాజీ ప్రధాని వాజ్‌పేయి, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, కొండగట్టు మృతులకు సభ సంతాపం తెలుపనుంది. అలాగే ఇతర అంశాలను సభ్యుల సలహా మేరకు చర్చించనున్నారు.