నేటి నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి

– లేకుంటే రెట్టింపు మొత్తం చెల్లించాల్సిందే..

నాగ్‌పూర్‌,ఫిబ్రవరి 14(జనంసాక్షి):ఫాస్టాగ్‌కు సంబంధించిన గడువును పొడిగించేది లేదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టంచేశారు. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్‌ను తీసుకోవాలని సూచించారు. టోల్‌ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు ఉద్దేశించిన ఫాస్టాగ్‌ తప్పనిసరి గడువు ఈ నెల 15తో ముగుస్తున్న నేపథ్యంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ గడువు పొడిగించేదీ లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికే రెండు మూడు సార్లు గడువును పొడిగించామన్నారు. మరోవైపు ఫాస్టాగ్‌ ఈ నెల 15 అర్ధరాత్రి నుంచి (16వ తేదీ) తప్పనిసరి చేస్తూ కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఫాస్టాగ్‌ అమర్చకపోతే సదరు వాహనాకి నిర్దేశించిన దానికంటే రెట్టింపు మొత్తం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.