నేడు ఎమ్మెల్యే రాకా
జనం సాక్షి కదలాపూర్
కథలాపూర్ మండలానికి ఎమ్మెల్యే రమేష్ బాబు సోమవారం రానున్నట్లు తెరాస మండల అధ్యక్షుడు గడిల గంగ ప్రసాద్ పత్రిక ప్రకటనగా తెలిపారు. ఈ సందర్భంగా గంగ ప్రసాద్ మాట్లాడుతూ ఎస్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో మధ్యాహ్నం 12 గంటలకు ఆసరా పెన్షన్లు అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా మండలంలోని దళిత బంధు పథకం కథలాపూర్ సిరికొండ గ్రామాలలో ప్రారంభోత్సవం నిర్వహించినట్లు ప్రసాద్ తెలిపారు దీనికిగాను మండలంలోని అన్ని గ్రామాల తెరాస సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.