నేడు జాతీయ సమైక్యతా దినోత్సవం
కాకినాడ,అక్టోబర్30(జనంసాక్షి): సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లాలో రాష్టీయ్ర సంకల్ప్ దివాస్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీలు, జాతీయభావం, దేశభక్తి గేయాలు, సందేశాలు తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. యువత ఎక్కువగా పాల్గొనెలా జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇదిలావుంటే జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 31న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల ద్వారా మెగా రుణమేళాలు నిర్వహించాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. గుర్తించని లబ్ధిదారులకు రుణమేళాల్లో 25 శాతం
రుణాలు అందజేయాలని సూచించారు. వీటికి సంబంధించిన సమాచారాన్ని నవంబరు 7వ తేదీలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా కాకినాడ సాగర తీరంలో హెలీపోర్టును ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కోస్తా తీర ప్రాంతంలో జిల్లా కేంద్రం కాకినాడను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు.