నేడే మహాత్మ జ్యోతిబాపూలే లో ఇంటర్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్స్! భూపాల్ పల్లి
ల్లి ప్రతినిధి ఆగస్టు 28 జనం సాక్షి: నేడు మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నట్లు వరంగల్ జిల్లా వెనుకబడిన తరగతుల రీజనల్ కోఆర్డినేటర్ రామ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నేడు సంబంధిత కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బైపీసీ గ్రూపుకు సంబంధించిన సీట్లు శాయంపేట 25, గన్ పూర్ 34 ,కమలాపూర్ 37, గుమ్మడూర్ 16 ,సి ఈ సి గ్రూపులో గన్ పూర్ 2, కమలాపూర్ 4 ,ఎం ఇ సి గ్రూపు శాయంపేట 33, హెచ్ఈసి గ్రూపులో కమలాపూర్ 28 సీట్లు ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ సర్టిఫికెట్లతో నేడు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు. ఇందుకు సంబంధించిన కళాశాలల సెల్ నెంబర్లు వెల్లడించారు. శాయంపేట 88 014 18 368, గన్ పూర్ 8688 614679, కమలాపూర్ 9700 32 8429 ,మొగుళ్లపల్లి 9849 56 0449, గుమ్మడూర్ 99 6 4 2 3 4 4 9 4 ,నంబర్లలో సంప్రదించాలని వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ రామ్ సింగ్ తెలిపారు.
ReplyForward
|