నేరస్తులతో సినీనటుల భేటీ దురదృష్టకరం

– ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి
– హైదరాబాద్‌ కేంద్రంగా బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారు
– ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం రానివారికి నామినేటెడ్‌ పోస్టులు
– దేశ ప్రయోజనాల కోసం మాత్రమే కేంద్ర స్థాయిలో పొత్తు
– టెలీకాన్ఫరెన్స్‌ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : నేరస్తులతో సినీనటుల భేటీ దురదృష్టకరమని, దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. బుధవారం చంద్రబాబు  పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ లో మాట్లాడారు.. నేరాలు, వాటిద్వారా కలిగే లబ్ధే ఇప్పుడు వైకాపాకు దొరికిన రాజకీయమని అన్నారు. దిక్కుతోచని స్థితిలో ఆపార్టీ ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ కేంద్రంగా బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైకాపాలో ప్రస్తుతం పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో యాత్ర చేస్తోందని, రాష్ట్రంలో ఆ పార్టీ విషయంలో మనం స్పష్టతతో ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం మాత్రమే కేంద్ర స్థాయిలో పొత్తు ఉంటుందని స్పష్టంచేశారు. పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని పాక్‌ స్పష్టం చేసిందన్నారు. ఈ విషయంలో రాజకీయ లబ్ధి దాగిఉందా? అనే అనుమానం దేశవ్యాప్తంగా బలపడుతోందని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే భాజపా రిమోట్‌ కంట్రోల్‌లో ఉందని తెలిపారు. కృష్ణా జిల్లా నేతల్లో చాలావరకూ గొడవలు లేకుండా ఎవరి పరిధిలో వారుపని చేసుకుంటున్నారని కితాబిచ్చారు. పేదల సంక్షేమానికి అందరూ కలిసి రావాలని సీఎం పిలుపునిచ్చారు. పనిచేసే వారికే ప్రజా దీవెనలు ఇవ్వాలన్నారు. 2019-24కు సమర్ధ బృందాన్ని ఎంపిక చేస్తున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయమే ప్రామాణికమని స్పష్టం చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశంరాని వారికి.. నామినేటెడ్‌ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. రాజకీయలబ్ధి కోసమే వైసీపీ తప్పుడు సర్వేలు చేస్తోందని విమర్శించారు. ఇతరులు సర్వే చేస్తే వైసీపీ అడ్డుకుంటోందన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ సర్వేలంటే వైసీపీకి భయమని సీఎం వ్యాఖ్యానించారు. బెదిరింపుల వల్లే కొందరు టీడీపీకి దూరమవుతున్నారని చెప్పుకొచ్చారు.
నమ్మకద్రోహానికి ఐదేళ్లు..
ఫిబ్రవరి 20కి సరిగ్గా ఈరోజుకు భాజపా ఏపీకి ద్రోహంచేసి ఐదేళ్లు అయిందని చంద్రబాబు గుర్తు చేశారు. నమ్మక ద్రోహానికి ఐదో వార్షికానికి నిరసనలు జరపాలని సూచించారు. ఐదు కోట్ల మందిని నమ్మించి మోసంచేసి ఐదేళ్లయిందని అన్నారు. ప్రత్యేక హాదాతో సహా మిగిలిన ఐదు హావిూలు గాలికి వదిలేశారన్నారు. రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీ ఇవ్వలేదని, వెనుకబడిన జిల్లాలకిచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్నారని ఆక్షేపించారు. భాజపా నమ్మక ద్రోహాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలన్నారు. జాతీయస్థాయిలో భాజపాయేతర పార్టీలతో కలిసి పనిచేస్తామని మరోమారు స్పష్టం చేశారు. నమ్మకద్రోహాన్ని నిరసిస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని నేతలను ఆదేశించారు. ప్రత్యేక ¬దా సహామిగిలిన ఐదు హావిూలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఆర్ధికలోటులో నాలుగో వంతు కూడా ఇవ్వలేదని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.