*నేరేడుచర్లలోని పలు ఆస్పత్రులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ బృందాలు.
నేరేడుచర్ల (జనం సాక్షి )న్యూస్.సరియైన ధ్రువపత్రాలు లేకుండా ఆస్పత్రులు నడిపించడం చట్టరీత్యా నేరమని,అర్హత లేని వారు వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తనిఖీ బృందాల ప్రత్యేక అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. అర్హతలు లేని వారు ఆస్పత్రులు ఏర్పాటు చేయవద్దని సూచించారు.శనివారం నేరేడుచర్లలోని బస్టాండు పరిసర ప్రాంతాల్లోని ఆసుపత్రులపై అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా పలు ఆసుపత్రుల్లోని రికార్డులు తనిఖీ చేశారు.ఆస్పత్రులకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు.ఈ సందర్భంగా నేరేడుచర్ల లోని ఆర్ఎంపీలు నడుపుతున్న వెంకట శివ ఫస్ట్ ఎయిడ్ సెంటర్,కోటయ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లను సీజ్ చేశారు. అర్హత కలిగిన టెక్నీషియన్లు లేకుండా నడిపిస్తున్న వెంకటేశ్వర ల్యాబ్ మరియు పూర్తిస్థాయి సౌకర్యాలు లేని స్నేహ ల్యాబ్ లను సీజ్ చేశారు.ఇంకా కొన్ని ఆస్పత్రిలో తాళాలు వేసుకోవడం అందుబాటులో లేకపోవడం గమనించారు.వెంకటేశ్వర ఆసుపత్రికి,సాయి శ్రీనివాస ఆస్పత్రులను తనిఖీ చేసి నోటీసులు అందించారు.వెంకటేశ్వర ఆస్పత్రిలో ఒక్క స్టాఫ్ నర్స్ కూడా లేకపోవడం వల్ల నోటీసులు ఇచ్చారు,వారు రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని తెలిపారు.సరైన వివరణ లేకపోతే సీజ్ చేస్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగయ్య,ప్రత్యేక అధికారులు భూతరాజు సైదులు, యాతాకుల మధుబాబు, అంజయ్య,జగదీష్ తదితరులు ఉన్నారు.