నైమిశారణ్యంలో ఘనంగా సహస్ర చండీయాగం తూప్రాన్

తూప్రాన్(జనం సాక్షి )జూన్ 19:: శ్రీ లలితా దేవి సమితి ఆధ్వర్యంలో దేవి ఉపవాసకులు సహస్ర చండీ యాగ కర్త సోమయాజుల రవీంద్ర శర్మ ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నైమిశారణ్యం లో సహస్ర చండీయాగాని ఘనంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం నుండి సుమారు 200 మంది భక్తుల ఆధ్వర్యంలో చండీ యాగాన్ని మూడు రోజులు హోమం కన్నుల పండుగగా నిర్వహించారు నైమిశారణ్యం లోని చక్రతీర్థం లో ప్రత్యేక పూజలు హారతి నిర్వహించారు అనంతరం పీర్ల పండుగ ఆదినారాయణ శర్మను ఘనంగా సత్కరించారు ఈ సహస్ర చండి యాగానికి తెలంగాణకు చెందిన 200 మంది భక్తులు హాజరయ్యారు



