నోట్ల రద్దు నమ్మలేకపోయా
పెద్ద నోట్ల రద్దుపై టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు చర్య తనను విశేషంగా ఆకట్టుకున్నట్లు విరాట్ చెప్పాడు. భారతీయ రాజకీయ చరిత్రలోనే అదో అద్భుతమైన ఘట్టం అని అన్నాడు. ఇంగ్లండ్‌తో రెండవ టెస్ట్ జరగనున్న నేపథ్యంలో ఇవాళ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ ముగిసిన తర్వాత హోటల్ బిల్లు కట్టేందుకు వెళ్లానని, అయితే తన దగ్గర ఆ సమయంలో పాత 500 నోట్లు ఉన్నాయని, అవి చెల్లవని గ్రహించిన తర్వాత ఆ నోట్లను తన దగ్గరే ఉంచుకున్నట్లు చెప్పాడు. తన అభిమానులకు సంతకం చేసి ఇచ్చేందుకు ఆ నోట్లను వాడనున్నట్లు విరాట్ చెప్పాడు. నోట్ల రద్దు నమ్మలేని అంశమన్నాడు.