న్యాయపరమైన చిక్కులు తొలగిపోగానే ఎన్నికలు
హైదరాబాద్: చిక్కులు తొలగిపోగానే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని హొంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. న్యాయస్థానంలో న్యాయ పరమైన అడ్డంకులు తలెత్తడం వల్లే ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం జరుగుతోందన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ముఫ్పై కోట్ల వ్యవయంతో మండలంలోని అన్ని గ్రామాలకు త్వరలోనే కృష్ణాజలాలు తరలిస్తామని తెలిపారు. మరోవైపు శంషాబాద్ గ్రామాన్ని జీవో 111 నుంచి మినహాయించినట్లు ప్రకటించారు.