న్యాయమూర్తులు దేశ పరిపాలనలో జోక్యం చేసుకోవద్దు-ఎన్‌హెచ్ కపాడియా
న్యూడిల్లీ: న్యాయమూర్తులు దేశాన్ని పాలించడం లేదా కొత్త విదానాలను తెర పైకి తేవడం వంటివి చేయవద్దని సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హెచ్.కపాడియా పేర్కొన్నారు. ‘నిద్ర హక్కు కూడా ప్రాథమిక హక్కే’ వంటి తీర్పుల విషయాంలో అమలుచేయగలగడాన్ని పరీక్షించాలని సూచించారు. న్యాయవ్యవస్థ పనితీరుపై నిజాయితీగా ఆత్మావలోకనం చేసుకున్న ఆయన.. ఒకవేళ అమలుచేయలేని విధంగా ఉన్న న్యాయ వ్యవస్థ ఆదేశాలను కార్యనిర్వహక వ్యవస్థ తిరస్కరిస్తే.. ఏం జరుగుతుందని ప్రశ్నించారు. శనివారం ఇక్కడ జరిగిన ఓ సదస్సులో కపాడియా ఉపన్యాసించారు. ‘నిద్ర కూడా ప్రాథమిక హక్కే’ అన్న సుప్రీంకోర్టు ఈ సంధర్బంగా ఆయన ప్రస్తావించాడు. శాసనవ్యవస్థలకు సంబందించిన అధికారాను రాజ్యాంగం విస్పష్టంగా పేర్కొందని, న్యాయమూర్తులు ఆ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.