న్యాయవ్యవస్థలోనూ రిజర్వేషన్లుండాలి కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ సదాశివం

ఢిల్లీ: ఉన్నత స్థానాల్లో న్యాయమూర్తుల నియామకం విషయంలోనూ రిజర్వేషన్లు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ పి. సదాశివం. ఓబీసీలకు, షెడ్యూల్డు కులాలు, తెగలకు, మైనారిటీలకు రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమితులయ్యే అవకాశం కల్పించాలని అయన సూచించారు. భిన్న వర్గాల ప్రజలు, సంస్కృతులు ఉన్న మనదేశంలో పనిచేస్తున్న వ్యవస్థల్లో అంతరాలు లేకుండా చూసుకోవడం అవసరమన్నారు. అయితే అందుకు ప్రత్యేక చట్టం ఏమీ అవసరం లేదని, కేవలం ప్రతిభ అధారంగా ఎంపిక చేయవచ్చని అయన అన్నారు.