‘ న్యూన్‌ కార్పొరేషన్‌’ నూతన విభాగ ఉపాధ్యక్షుడిగా నరిశెట్టిరాజు

వాషింగ్టన్‌ నుంచి న్యూస్‌టుడే ప్రతినిధి : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రముఖ వార్తా ఛానళ్ల సంస్థ ‘ న్యూస్‌ కార్పోరేషన్‌’ వ్యూహరచన – ప్రణాళిక ‘ విభాగానికి ప్రవాసాంధ్రుడు, ప్రముఖ పాత్రికేయుడు నరిశెట్టి రాజు ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం న్యూస్‌ కార్పొరేషన్‌లో భాగమైన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు డిప్యూటి మేనేజింగ్‌ ఎడిటర్‌గా వ్యాహిరిస్తున్న రాజు మార్చి 11వ తేదీ నుంచి నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన నియామకర పట్ట ‘ నూతన న్యూన్‌ కార్పోరేషన్‌ ‘ సీఈవో రాబర్ట్‌ ధామ్సన్‌  స్పందిస్తూ ప్రపంచీకరణ, సాంకేతిక ఎల్లలు దాటుతున్న ప్రస్తుత తరుణంలో రాజు లాంటి వ్యక్తులు అవసరం సంస్థ సమాజానికి అవసరమని అన్నారు. భవిష్యత్తు అవసరాలను ముందుగానే గమనించి దిశానిర్దేశం చేయటంలో ఆయన పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు. పాత్రికేయ రంగంలో నిపుణులు తయారుచేయటంలో పేరుగాంచిన బ్లూమింగ్టన్‌లోని ఇండియానా విశ్వవిద్యాలయ విద్యార్థిగా 1991లో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ఇంటర్న్‌షివ్‌ చేసిన రాజు ఆ సంస్థకే ఉపాధ్యక్షుడు కావటం హర్షించదగ్గ విషయమని పలువురు ప్రవాసాంధ్రులు కొనియాడారు. 2006నుంచి 2009 వరకు వాల్‌స్ట్రీన జర్నల్‌ యూరప్‌ విభాగ సంపాదకునిగా, 2009 జనవరి నుంచి 2012 జనవరి వరకు వాషింగన్‌ పోన్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌గా 2012 ఫిబ్రవరి నుంచి వాల్‌సీట్‌ జర్నల్‌ డిప్యూటీ మేనేజింగ్‌ ఎడిటర్‌గా రాజు బాధ్యతలు నిర్వహించారు.