పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి
జూలై 15, జనం సాక్షి.దౌల్తాబాద్ మండల పరిధిలో సూరంపల్లి గ్రామం లో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ పలు పంటలు పరిశీలించారు. మొక్కజొన్న, ప్రత్తి పంటలు కలుపు నివారణ చేపట్టాలని సూచించారు.
అలాగే పత్తి పంటకు మల్టీ కే పంట లపైన పిచికారి చేయాలి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల వ్యవసాయ అధికారి గోవిందరాజులు ,సూరంపల్లి సర్పంచ్ నర్సింలు పాల్గొన్నారు.
Attachments area



