పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి.
మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు 26
ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని నేరెడ్ మెట్ సీఐ నరసింహ స్వామి,మల్కాజిగిరి సిఐ జగదీశ్వర్ రావు సూచించారు.శుక్రవారం ఆనంద్ బాగ్ లోని బృందావన్ ఫంక్షన్ హాల్ లో అన్ని శాఖల అధికారులతో కలిసి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈసమావేశానికి తహసిల్దార్ నిర్మల నాయక్,డిప్యూటీ కమిషనర్ రాజు,డిప్యూటీ సిటీ ప్లానర్ గజానంద్,ఈఈ లక్ష్మణ్ హాజరయ్యారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో ముగిసే విధంగా కృషి చేయాలని డిప్యూటీ కమిషనర్ రాజు అన్నారు.గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని,డీజే లకు అనుమతి లేదని సీఐ నరసింహ స్వామి అన్నారు.
మండపాల దగ్గర అప్రమత్తంగా ఉంటూ అనుమానితుల పై నిఘా ఉంచాలని సూచించారు.దీపాలు పెట్టేటప్పుడు ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ సుదీర్ కృష్ణ, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.