పట్టణ పేద ప్రజల కోసమే ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు.
– మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కడవేరుగు మంజుల రాజనర్సు.
సిద్దిపేట బ్యూరో 22, జూలై ( జనం సాక్షి )
సిద్దిపేట పట్టణంలోని 37 వ వార్డులో కంటి శుక్లాల శస్త్ర చికిత్స అవగాహన కార్యక్రమంలో కౌన్సిలర్ సాకి బాల్ లక్ష్మీ ఆనంద్ తో కలిసి ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కడవేరుగు మంజుల రాజనర్సు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ హరీష్ రావు సిద్దిపేట పట్టణంలోని అన్ని వార్డులలోని ప్రజలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలని అవసరమగు వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ లు చేపట్టాలని పిలుపునివ్వడంతో పట్టణంలోని అన్ని వార్డులలో ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అని తెలియజేసారు. సిద్దిపేట ప్రజల కోసం ప్రత్యేకంగా మంత్రి హరీష్ రావు ఉచితంగా ఈ కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రజలు ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఇంటి వద్ద నుండే మిమ్మల్ని ఉచిత వాహనాల ద్వారా ఆసుపత్రికి తీసుకవెళ్లి ఆపరేషన్లు చేపించి సురక్షితంగా మీ ఇంటికి తీసుకరావడం జరుగుతుంది అని ప్రజలకు భరోసా కల్పించారు.కార్యక్రమంలో సాకి ఆనంద్,డాక్టర్లు హిమబిందు, శ్రీనివాస్, శ్రీనాథ్, పి.ఎమ్.ఎమ్.ఒ భద్రయ్య,నోడల్ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్, మహేందర్,ఎ.ఎన్.ఎమ్ లు తదితరులు పాల్గొన్నారు.
Attachments area