పట్టిసీమలో భారీగా ఏర్పాట్లు

 

ఏలూరు,మార్చి1(జ‌నంసాక్షి): మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టిసీమలోని వీరేశ్వరస్వామి ఆలయంలోఅధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇసుక తిన్నెలపై చలువ పందిళ్లు, ఆలయం వద్ద క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్ల ఏర్పాటు పూర్తి చేశారు. మరుగుదొడ్లు, మహిళలు దుస్తులను మార్చుకునే గదుల ఏర్పాటు జరుగుతోంది. తాగునీటి కోసం ఇసుక తిన్నెలపై పైపులైను వేసే పనులు జరుగుతున్నాయి. రేవుల్లో జెట్టూల నిర్మాణం చేపట్టారు. అయిదు పంట్లు, ఆరు లాంచీలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి పంటును ఒక లాంచీకి కట్టి దానిపై భక్తులను నది దాటించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆరో లాంచీపై భక్తులను ఎక్కించి తీసుకెళ్లే విధంగా ప్రణాళిక రూపొందించారు. మరో పది పడవలు సిద్ధం చేస్తామని, రద్దీని బట్టి వాటిపై తరలించేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు.