పట్టిసీమలో శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు

ఏలూరు,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టిసీమలో సకల ఏర్పాట్లు చేశారు. .పోలవరం మండలం పట్టిసీమ రేవులో దైవదర్వనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఉత్సవ కమిటీ నిర్వాహకులు అన్నారు. తాటాకు పందిళ్లకు, మరుగుదొడ్లు, లైటింగ్‌, బారికేడ్లను ఏర్పాటు చేశారు. అందరి సహకారంతో ఉత్సవాలను విజయవంతం చేస్తామని, అందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేసామని అన్నారు. గూడెం మండలం వీరంపాలెంలోని బాలాత్రిపుర సుందరీదేవి పీఠంలో మహాశివరాత్రి ఉత్సవాలు  మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికొచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళ వాయిద్యాలతో వేదమంత్రాలతో ఆలయ ప్రదక్షిణ, యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచన, దీక్షాధారణ, మహావిద్య పారాయణ, వేదపారాయణ, సర్వదేవతా ఆవాహనం, గోపూజ, సూర్యనమస్కారాలు, మహాలింగార్చన, స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, మేథా సరస్వతి అమ్మవారికి లక్షపుష్పార్చన, విశ్వేశ్వరస్వామివారికి లక్ష బిల్వార్చన, ఆధ్యాత్మిక ఉపన్యాసం, భూప్రస్తార శ్రీచక్రార్చనతో ఉత్సవాలను ప్రారంభిస్తారు.  తెల్లవారుజాము నుంచి స్పటికలింగేశ్వర స్వామివారికినదీ జలాలతో అభిషేకాలు, 5 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం, వేదపారాయణ, రుద్రపారాయణ, 16 మంది రుత్వికులతో మహన్యాస పఠనం, 42 అడుగుల మహాదేవునికి 12 రకాల విశేష ద్రవ్యాలతో మహాకుంభాభిషేకం చేస్తారు.  విశ్వేశ్వర స్వామివారికి 11 లక్షల రుద్రాక్షలతో అర్చన, సర్వదేవతా
¬మం, సంపూర్ణ పూర్ణాహుతి ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.