*పత్రిక ప్రచురణ నేటి యువతకు అవసరం ఆచరణ మార్గర్శకం..గాంధీ* బడుగుల సైదులు
కోదాడ అక్టోబర్ 1(జనం సాక్షి)
నేటి యువతకు గాంధీ సద్భావన ప్రతీక మంచికి మారుపేరు అయిన గాంధీ చెప్పిన విషయాలు ఆయన నమ్మిన సిద్ధాంతాలు నేటి యువతకు అవసరము ఆచరణ మార్గదర్శకం అని సామాజిక ఆర్థిక విద్యావేత్త బడుగుల సైదులు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసినాడు గాంధీజీ అధికారంతోనో ఆస్తిపాస్తులతోనూ ప్రఖ్యాతిగాంచలేదు కేవలం శాంతి అహింస సమానత్వం తాను నమ్మిన సిద్ధాంతాలను ధైర్యంగా ఆత్మ నిగ్రహంతో కష్టాలను ఓర్చుకుని ఆచరణలో పెట్టి విశ్వవిఖ్యాతి నాయకుడిగా భారత స్వాతంత్ర సమరయోధుడిగా భారత జాతిపితగా పిలవబడుతున్నాడు గాంధీ నమ్మిన ఆచరించిన సిద్ధాంతాలు సమైక్యత రాగం పరమత సహనం సర్వ ధర్మ సమ భావన నేటి యువతకు అవసరం పెద్దలంటే గౌరవం పవిత్రత పరిశుభ్రత దీన జనో దరణ మనుషులంతా ఒక్కటే చెడు స్నేహాలను వదిలివేయడం సేవాభావము నైతికత ఆత్మగౌరవం లాంటి గాంధీ తత్వాలు నేటి యువత అందిపుచ్చుకొని సత్ప్రవర్తనతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు గాంధీజీ రెడ్ క్రాస్ కార్యకర్తగా సేవలందించారు ప్రేమ దయ ద్వారా మానవత్వం పెంపొందించబడుతుందని తెలియజేసినాడు అవమానాలను అసమానతలు ఎదుర్కొని ఆత్మ శక్తితో రాజీ పడకుండా ముందుకెళ్లినాడు ఇలాంటి సద్గుణాలు సద్భావనలతో నేటి యువత ఆధునిక యాంత్రిక యుగంలో సత్ప్రవర్తన మానవత్వంతో కూడిన విలువైన జీవితానికి బాటలు వేసుకోవడానికి గాంధీ బోధనలు శాంతియుత సమాజాభివృద్ధికి మరియు వ్యక్తిత్వ నిర్మాణానికి దోహద పడతాయనీ తెలియజేశారు .
Attachments area