పదిమందికి ఉపాధి కల్పించే విధంగా విశ్వకర్మలు ఎదగాలి :అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం

 అఖిల్ లోకేష్  జ్యువెలరీ షాపు ను ప్రారంభం

ఎల్బీనగర్ (జనం సాక్షి ) వ్యాపారాలలో రాణించి  పదిమందికి ఉపాధి కల్పించే విధంగా విశ్వకర్మలు తయారు కావాలని  అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం పిలుపునిచ్చారు. నిర్వాకులు  అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర కార్యదర్శి వోరువాల వీరేష్ చారి   కాంచనబాగ్ లోని  లక్ష్మాపురం కాలనీలో    నూతనంగా ఏర్పాటు చేసిన   అఖిల్ లోకేష్  జ్యువెలరీ షాపు ను కౌలే జగన్నాథం ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రిపేర్ కట్ చేసి  ప్రారంభోత్సవం చేయడం జరిగింది.    ఈ సందర్భంగా  అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం మాట్లాడుతూ నేడు కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి కులవృత్తులు చిన్న భిన్నమవుతున్నాయని    విశ్వకర్మలు అందరూ  మన చేతివృత్తులు అడుగంటి పోకుండా మన వృత్తులను మనమే కాపాడుకోవాలని సూచించారు,  స్మాల్ స్కీమ్ ఇండస్ట్రీ కింద షాపులను ఓపెన్ చేసుకొని  అభివృద్ధి చెందాలని, ఎవరికోసం ఎదురు చూడకుండా కష్టపడి పని చేసి మన షాపులలో మన వాళ్లకే పని కల్పించాలని కోరుకుంటూ అలాగే అందరూ ఐకమత్యంగా ఉండాలని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో అఖిల భారత విశ్వకర్మ మహాసభ గౌరవ అధ్యక్షులు తల్లోజు చెన్నయ్య చారి , కోశాధికారి ఆవంచ మురళి ,తోట శ్రీనివాస్ , ఇరటి మాధవాచారి , మేడిపల్లి వెంకటేష్ చారి, మారోజు రవిదరాచారి, వినోద్ కుమార్, రాము, దాసోజు లక్ష్మాచారి తదితరులు పాల్గొన్నారు