పరిటాల సిద్దార్థ చుట్టూ బిగుస్తున్న బుల్లెట్ ఉచ్చు
విచారణ చేసిన శంషాబాద్ విమానాశ్రయ అధికారులు
మరోమారు విచారణకు రావాలని ఆదేశం
హైదరాబాద్,అగస్టు21(జనంసాక్షి): పరిటాల సిద్దార్థ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో సిద్దార్థను పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో పరిటాల సిద్దార్థ విచారణ ముగిసింది. మరోసారి హాజరుకావాలని పరిటాల సిద్దార్థను ఆదేశించారు. పోలీసుల నోటీసులకు సిద్దార్థ సరైన సమాధానం ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారుల సలహాతో ఎయిర్ పోర్ట్ పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకొనున్నారు. దీంతో మరోమారు హాజరు కావాల్సి ఉంటుందని సిద్దార్థను పోలీసు ఆదేశించారు. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో సిద్దార్థ బ్యాగులో 5.56 క్యాలిబర్ బుల్లెట్ పోలీసులకు దొరికింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి శ్రీనగర్‌కు సిద్దార్థ
వెళ్తుండగా సీఐఎస్‌ఎఫ్ అధికారులు తనిఖీ చేసినపుడు బ్యాగులో బుª`లలెట్ ఉన్నట్టు కనుగొన్నారు. కాగా బ్యాగులో బుª`లలెట్ ఉందని, దానికి అవసరమైన పత్రాలు లేవని తనకు తెలియదని సిద్దార్థ చెప్పినట్టు సమాచారం. ఆయనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి, వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్‌తో పరిటాల సిద్దార్థ్ పట్టుబడ్డాడు. వివరణ ఇవ్వాలని ఎయిర్‌పోర్ట్ పోలీసులు నోటీసులిచ్చారు. సిద్దార్థ లైసెన్స్‌డ్ గన్‌కు బ్యాగులో దొరికిన బుల్లెట్‌కు వ్యత్యాసం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో పాయింట్ 32 క్యాలిబర్ గన్‌కు సిద్దార్థ్ లైసెన్స్ పొందారు. బుధవారం ఎయిర్‌పోర్ట్‌లో సిద్దార్థ బ్యాగులో 5.56 క్యాలిబర్ బుª`లలెట్ పోలీసులకు దొరికింది. సిద్దార్థ్ వద్ద సాయుధ బలగాలు వాడే ఇన్సాస్ రైఫిల్ బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ బుల్లెట్ సిద్దార్థకు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అనంతపురానికి చెందిన ఇండో టిబెటెన్ బోర్డర్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ తూటాగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్‌తో పరిటాల కుటుంబానికి పరిచయాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురువారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి శ్రీనగర్‌కు సిద్దార్థ వెళ్తుండగా సీఐఎస్‌ఎఫ్ అధికారులు తనిఖీ చేసినపుడు బ్యాగులో బుల్లెట్ ఉన్నట్టు కనుగొన్నారు. కాగా బ్యాగులో బుª`లలెట్ ఉందని, దానికి అవసరమైన పత్రాలు లేవని తనకు తెలియదని సిద్దార్థ చెప్పారు. ఆయనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి, వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.