పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి -నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
ఖైరతాబాద్ : జూన్ 06 (జనం సాక్షి) పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాలనీ వాసులను కోరారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలోనీ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 11లోని ఉదయ్ నగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ మాట్లాడుతూ… కాలనీలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా చెత్తను గానీ నిర్మాణ, ఇతర వ్యర్ధాలు పడవేయవద్దని ఈలాంటి చర్యల వలన అనారోగ్య బారిన పడుతారన్నారు. ఈ విషయంలో ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు కాలనీలో పర్యటించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీధుల్లో, కాలనీలో ఎలాంటి చెత్త, వ్యర్ధాలు వేయకుండా స్వచ్ఛ కాలనీలుగా మార్చుకునేందుకు ప్రయత్నించాలని కోరారు. వస్తువులను ఇంటి ముందు ఉన్న చెత్తను ఐదు రోజుల్లో క్లియర్ చేసి స్వచ్ఛ కాలనీగా మార్చేందుకు అధికారులు, ప్రజలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉదయ్ నగర్ వార్డు నందు పనికిరాని వస్తువులను, భవన నిర్మాణ వ్యర్ధాలను, మ్యాన్ హోల్స్ రిపేర్, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ రిపేర్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. డ్రెయిన్స్, వాటర్ లీకేజ్, సీవరేజ్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా వాటర్ బోర్డ్ డీజీఎమ్ శ్రీనివాస్ ను ఆదేశించారు. వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాల్సిందిగా వెటర్నరీ ఎడిని సూచించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న డబ్బాలను వెంటనే తొలగించాలని, ఫైన్ వేసేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. ఉదయ్ నగర్ వ్యాప్తంగా ఎంటమాలజీ ద్వారా దోమలను నియంత్రించేందుకు ఫాగింగ్ చేయాలన్నారు. గుర్తించిన సమస్యలు వెంటనే పూర్తి చేయాలని ఐదు రోజుల్లో స్వచ్ఛ వార్డుగా మార్చివేయాలని తెలిపారు. ఈ సందర్భంగా రేషన్ షాపులను పరిశీలించి నిత్యావసర పంపిణీ పై ఆరా తీశారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి, వార్డు నోడల్ ఆఫీసర్ దుర్గాప్రసాద్, డిఈ, వాటర్ వర్క్స్ డిజిఎం శ్రీనివాస్, శానిటేషన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిఈ శివానంద్, అధికారులు, ఉదయ్ నగర్ అసోసియేషన్ మెంబర్స్ పాల్గొన్నారు.
Attachments area
|