పల్గుల లో పోషన అభియాన్ ర్యాలీ….
మహదేవపూర్ సెప్టెంబర్ 13 జనంసాక్షి
మహాదేవపూర్ మండలంలోని పల్గుల గ్రామంలో మంగళవారంనాడు పోషన అభియాన్ మహోత్సవాలల్లో భాగంగా అంగన్వాడీ లు ర్యాలీ నిర్వహించారు. మహాదేవపూర్ ఐ సి డి ఎస్ ప్రాజెక్టు అధికారిని రాధికా రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో ఇంటింటా తిరుగుతూ పోషకాహారం పై గర్భిణులకు, పిల్లతల్లులు,కిశోర బాలికలకు, పిల్లలకు అవగాహన కల్పించారు,చిరు ధాన్యాలల్లో పోషక విలువల వుంటాయని పోషక ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వారికి వివరించారు,పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు,గర్భిణీలకు శ్రీమంతాలు,పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ మనేం లక్షయ్య, ఉప సర్పంచ్మచ్చ వెంకటేష్, కారోబర్ సాగర్, పాఠశాల ఉపాధ్యాయులు అనిల్,రమేష్, అంగన్వాడీటీచర్లు శైలజ,ఉమామహేశ్వరి,తిరుపతమ్మ,ఆయా లు రాజక్క, సారక్క, ఆశా లు సంధ్యరాణి, బి పి ఎం అరవింద్,గ్రామస్తులు, పాల్గోన్నారు, అనంతరం ఉప సర్పంచ్ వెంకటేష్, చేర్స్ టేబుల్ పంపినిచేశారు.
Attachments area