పవిత్ర భూమిని రక్షించు కుంటాం
గుజరాతీల ఆక్రమణ నుంచి కాపాడుకుంటాం
వీల్ చైర్ లో దీదీ ప్రచారం
కోల్‌కతా14 మార్చి (జనంసాక్షి) : తన పవిత్ర భూమిని రక్షించుకునే ఈ పోరులో చాలా బాధలు పడ్డాం. ఇంకా పడతాం.. కానీ గుజరాతీల ఆక్రమణ నుంచి కాపాడు కుంటా పిరికిపందలకు తలొగ్గేది లేదని దీదీ ప్రకటించారు.గాయం కారణంగా నాలుగు రోజుల పాటు ఆసుపత్రికే పరిమి తమైన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (66) మళ్లీ తన ప్రచారాన్ని ప్రారం భించనున్నారు. కాలికి గాయం ఉండటం తో వీల్‌ఛైర్‌లోనే తన ప్రచారాన్ని కొనసాగిం చనున్నారు. ఆదివారం మధ్యాహ్నం కోల్‌కతాలో భారీ రోడ్ షో నిర్వహించ నున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం లో మమతా బెనర్జీ కాలికి గాయమైంది. కొందరు వ్యక్తులు కారు డోరును బలంగా తోయడంతో తన కాలికి గాయమైందని దీదీ పేర్కొన్నారు. దీని వెనక కుట్ర దాగి ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన ప్రత్యేక పరిశీలకుల బృందం.. మమతా బెనర్జీపై ఎలాంటి దాడి జరగలేదని, ప్రమాదవశాత్తు ఆమె గాయాలపాలయ్యారని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించింది. ఘటన పథకం ప్రకారం జరిగింది కాదని తేల్చిచెప్పింది. ముఖ్యమంత్రికి అతి సవిూపంగా జనం తోసుకుంటూ వచ్చినా వారిని నియంత్రించడంలో పోలీసులు, భద్రతా సిబ్బంది విఫలయ్యారని నివేదికలో పేర్కొంది.”ఈరోజు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండమని వైద్యులు నాకు సూచించారు. అయినా నేను తప్పకుండా ర్యాలీలో పాల్గొనాలనుకున్నా. ఎందుకంటే నా కాలి గాయం కారణంగా ఇప్పటికే మనం కొన్ని రోజులు కోల్పోయాం. నియంతృత్వ ధోరణితో ప్రజాస్వామ్యాన్ని తొక్కేస్తున్నారు. ప్రజలు పడుతున్న ఈ బాధతో పోలిస్తే, నేను పడుతున్న ఈ బాధ అంత తీవ్రమైనదేవిూ కాదు” అని మమత పేర్కొన్నారు. మమతా బెనర్జీ ‘బెంగాల్ బిడ్డ’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో రోడ్‌షో మార్మోగింది. మరోవైపు దాడి చేయటం వల్ల మమత కాలికి గాయమవలేదని, సిబ్బంది వైఫల్యం వల్లే ఆమె గాయపడ్డారని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ధారణకు వచ్చింది.