పశువుల యజమానులకు ఆర్ధిక సహాయం
జహీరాబాద్ జులై .
(జనంసాక్షి) జహీరాబాద్
(జనంసాక్షి) జహీరాబాద్నియోజకవర్గంలోని ఆయా మండలాలలో గత కొన్ని రోజుల క్రితం విద్యుత్ ప్రమాదంలో పశువులు మృతి చెందడం పట్ల బాధిత పశువుల యజమానులకు ఆర్థిక సాయంగా 40 వేల చొప్పున ముగ్గురు లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 1.60 లక్షల పరిహారం విడుదల చేసింది. విడుదలైన పరిహారంకు సంబంధించి చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావ్ బుర్డిపడ్ గ్రామానికి చెందిన రైతు కు 40,000/-, జంబార్బౌడీ గ్రామానికి చెందిన తుంకుంటా అశోక్ రూ.80,000/- గొడియర్పల్లి గ్రామానికి చెందిన శివరాజ్ కు రూ.40,000/- విలువ గల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.విద్యుదాఘాతంతో మృతి చెంది ఆర్థికంగా నష్టపోయిన లబ్ధిదారులకు ప్రభుత్వపరంగా పరిహారం విడుదల చేసిన ఎమ్మెల్యే కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు పెంట రెడ్డి,ఎలక్ట్రిసిటీ ఏ.డి. మహేష్,అధికారులు ఐయాజ్, తదితరులు పాల్గొన్నారు.



