పాకిస్థాన్‌లో భారీ భూకంపం

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లో గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌లోని పెషావర్‌, లాహోర్‌, ఇస్లామాబాద్‌లో భూమి తీవ్రంగా భూమి కంపించింది. ఆస్థి నష్టం సంభవించినట్లు సమాచారం. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. హిందుకుష్‌ పర్వత శ్రేణిలోని కైబర్‌ ప్రాంతమంతా కంపించింది. పంజాబ్‌, కైబర్‌ కనుమల ప్రాంతాలలో భూమి కంపించింది. పాకిస్థాన్‌ భూకంపంతో ఉత్తర భారతంలో స్వల్పంగా భూప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. రాజస్థాన్‌, చండీగడ్‌, శ్రీనగర్‌లలో స్వల్ప భూప్రకంపనాలు సంభవించాయి.